Monday, September 16, 2013

ఆవేదనకై అన్వేషణ

ప్రతి క్షణం భయం భయం ... అనుక్షణం అయోమయం ...
ధృతం హితం పరాన్కితం ... స్వయంకృతం ఓ వికృతం ....
అహితమైన అహం సహితమై ... మరో పతనమై నా గమ్యం ...
దివి విడిచిన అశ్రువు ఒకటి ... నా కన్నుల చేరితే ...
నిప్పుల ఎడారిలోన ... నీటి కరువుతో గుండె బరువుతో ... కన్నీరైనా నీరేనని ఆనందిస్తున్నా ఈ లోకంలో ...
ఆశ రాదు ... నిరాశ పోదు ... వలచిన అలసటతో స్నేహం కడుతూ ..
గెలిచిన ఓటమి గేలి చేస్తూ ఉంటే... ప్రాణమైన మానం చావు గానం చేస్తూ ఉంటే ...
తలచేందుకు రేపు లేక ... మరచేందుకు నిన్న పోక ... ప్రతి క్షణం ఓ మరణమై ఆవహిస్తూ ఉంటే ...
ఆశల దప్పికతో ... ఊహల ఉక్కిరిలో .... తలమునకలై .. తలముక్కలై కాలంతో తలపడుతున్న ఓ బాటసారిగా ...
నన్ను కలిసేందుకు... స్నేహ హస్తం ఇచ్చేందుకు.... చివరకి మరణమైనా ఉందని సంతోషిస్తున్న వెర్రివాడిని నేను....

2 comments:

Anonymous said...

Awesome Sarwa!

Unknown said...

Its Awesome!