Tuesday, July 14, 2009

నిన్ను చేరలేక...

అందాన్ని అబద్ధంగా చూపడానికి ప్రయిత్నించేవాడు....

నిశ్శబ్ధాన్ని వినలేక చెవులు మూసుకొనేవాడు....

కనులు తెరిస్తే ఆ కనులు విడిచి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావనే భయంతో కనురెప్పకి రాయిని కట్టి నిద్రించేవాడు...

నీ మనసుకి అర్ధం కావాలనే తపనతో ప్రేమ అనే భాషని నేర్చుకొనేవాడు...

మనసు మరణించిందని అమృతంతో బ్రతికించడానికి ప్రయిత్నించేవాడు... (మనిషినైతే బ్రతికిస్తుంది... అది మనసుని కూడా బ్రతికిస్తుందా.... ?)

వస్తువు పగిలితే శబ్ధం వస్తుంది.... మనసు పగిలితే నిశ్సబ్ధం మిగులుతుందని....తెలుసుకొని చిరునవ్వుతో ఓదార్చుకొనేవాడు... నీ ప్రేమికుడు... :)

Thursday, May 28, 2009

చెప్పిన మాట!

అమాయకంగా అడుగులో అడుగేస్తూ... స్కూలుకి వెళ్ళేటప్పుడు అమ్మ రోజూ చెప్పే మాటలు....
నాన్నా... ఎవరు ఏమిచ్చినా తీసుకోవద్దు అని...
అవే మాటలు పెద్ద అయిన తర్వాత కూడా చెప్తే ఎంతో బాగుండేది కదా...?

నాన్న చెప్పేవారు ఒకరు ఇచ్చిన వస్తువుని జాగ్రత్తగా ఉంచమని...
మన వస్తువు పోయినా పర్వాలేదు... వాళ్ళ వస్తువు పొరపాటున కూడా పాడు చేయోద్దని (అలాగే చేసా నా మనసుని చేజార్చుకున్నా... కాని ఆమె మనసుని మాత్రం పదిలంగా దాచాను).


ఫ్రెండు తరచూ అనేవాడు.... రాళ్ళకి మనసుంటే బాగున్ను... వాటిని కాస్త పరిశోధించి అమ్మాయిల మనసులో ఏముందో తెలుసుకోవచ్చు అని... ...(కాని నాకేం తెలుసు... ఆనందం కష్టం తర్వాత వస్తుంది.... ప్రేమ నష్టానికి ముందు వస్తుందని...)


ఆ అమ్మాయి చెప్తూ ఉండేది... అలాంటి మనసు కావాలని... ఎలాంటి మనసు కావాలో ఇప్పటి వరకు అర్ధం కాలేదు...(బహుశా పార్ట్నర్ అంటే షాపింగు లో డ్రెస్సు సెలెక్టు చేయడం ఏమో...?)


కాని ఇప్పుడు నా మనసు చెపుతోంది ... ఒక్కసారి బాల్యం లోకి వెళ్ళాలి అని...మరొక్కసారి ఈ తప్పులు చేయని జీవితం మొదలు పెట్టాలి అని...

Tuesday, February 17, 2009

Oh My Friend!

మనిషికి అదృష్టం అనేది ఉంటే... అది వారి స్నేహితులు మాత్రమే...

నా కన్నీటికి భయం నువ్వంటే... వెంటనే తుడిచేస్తావని....

నా మనసుకి ఇష్టం నువ్వంటే... నాలాగే ఆలోచిస్తావని....

నాలో ఉన్న భయం కూడా భయపడుతుంది... ఆ స్థానంలో నువ్వు ధైర్యాన్ని నింపేస్తావని...

ఆనందాన్ని మాటల్లో చెప్పలేను... కాని చూపించగలను.... నీ రూపంలో...

Wednesday, January 21, 2009

నీ ధ్యాసలో!


చినుకు బరువుకు తనువు తేలికయ్యంది... నీ రాకతో...

తళుకు మెరుపుకు చీకటి చిట్లిపోయింది... నీ నవ్వుతో...

ఎదురు చూపుకు త్రోవ చిన్నదయ్యింది... నీ స్పర్శతో...

మరుపు మలుపుకు మొదలు చిగురించింది... నీ చూపుతో...

నీ పెదవి పిలుపుకు మనసు మరొక్కసారి జన్మించిది.... నీ మధురిమతో...

Monday, January 19, 2009

నీకు న్యాయమా?


ఎందుకో తెలియదు... సాగర కెరటాల ఆరాటాలు నా మనసులో ఎప్పుడూ ఎగిసి పడుతూనే ఉంటాయి...

ఎన్నో ఆశలు...ఎన్నో ఊహలు...ఎన్నో కలల సౌధాలు...ఒక్కసారిగా కన్నీటి ధారలలో చేరిపోయాయి...

ఒక శిల శిల్పంగా మారాలి అంటే ... శిల్పికి ఎంత ఓర్పు అవసరమో...ఆ శిలకి కూడ అంతే సహనం అవసరం..

।ఏ ఒక్కరు విసుగు చెందినా... శిల లో ఉన్న శిల్పం కలగానే ఉండి పోతుంది...

కనురెప్పను తెరవడానికి ఒక వెలుగు అడ్డు వస్తోంది అంటే... ఆ తప్పు కిరణానిది కాదు...

చూసేందుకు శక్తి లేని ఆ నయనానిది...

అదే కన్నులతో నా మనసుని చూడలేని నువ్వు... తప్పు నా పైన వెయ్యటం నీకు న్యాయమా?

నీకు తెలుసా?

నీ చిరునవ్వుని అడగాలని ఉంది... కష్టం అంటే తెలుసా అని...

ఆ చిరుదివ్వెను అడగాలని ఉంది... చీకటి అంటే తెలుసా అని...

నీ సిరిమువ్వని అడగాలని ఉంది... మౌనం అంటే తెలుసా అని...

ఆ చిరుగాలిని అడగాలని ఉంది... స్థంబించటం అంటే తెలుసా అని...

నీ చిరు మనసుకి చెప్పాలని ఉంది... నా శ్వాసకి ప్రాణం నువ్వే అని...