Wednesday, May 21, 2008

ఒక ఆశ నా శ్వాస అయిన వేళ..

మనసుకు మౌనం అనే రాయిని కడితే...

ఆ మనసుని నీ ఆలోచనలు అనే గదిలో ఉంచితే...

ఆ గదిలో నీ నవ్వుల కాంతిని మాత్రమే ప్రసరిస్తే...

ఆ కాంతిలో నీ చూపుల దారులను వెతుకుతూ ఉంటే...

ఆ దారులలో నీ పాదాలు స్పర్శించి వికసించిన పుష్పాలు కనిపిస్తే...

ఆ సమయంలో కాలానికి కాస్త అలసట వచ్చి అక్కడే నిలచి పోతే...

ఆ స్పర్శకై ప్రతీ క్షణం జన్మిస్తా...

ఎందుకంటే క్షణాన్ని ఒక జన్మలా భావిస్తున్నా గనుక...

నిరీక్షణ

కష్టం అంటే ఏంటో తెలుసు... కాని ఎలా భరించాలో తెలియదు...
కోపం అంటే ఏంటో తెలుసు... కాని దాన్ని ఎలా చూపించాలో తెలియదు...
ప్రేమ అంటే ఏంటోకూడా తెలుసు... కాని ఎలా ప్రేమించాలో తెలియదు...
కాలం విలువ తెలుసు... కాని దాన్నిఎలా ఉపయోగించాలో తెలియదు...
ఇవన్నీ నువ్వు పరిచయం కాక ముందు...
కాని ఇప్పుడు ఎలా కష్టపడాలో తెలిసింది ... నీ నవ్వు కోసం...
నాపై నేను ఎలా కోప్పడాలోతెలిసింది... నేనంటే ఇష్టం లేదు అన్నప్పుడు...
ప్రేమించడం కూడా ఇప్పుడే తెలిసింది... నీ కనులని చూసినప్పుడు...
కాలం విలువ ప్రతీ క్షణం ... నన్ను శిలువ వేసేలా చేస్తోంది... నీకోసం వేచి చూస్తున్నప్పుడు॥