Wednesday, January 21, 2009

నీ ధ్యాసలో!


చినుకు బరువుకు తనువు తేలికయ్యంది... నీ రాకతో...

తళుకు మెరుపుకు చీకటి చిట్లిపోయింది... నీ నవ్వుతో...

ఎదురు చూపుకు త్రోవ చిన్నదయ్యింది... నీ స్పర్శతో...

మరుపు మలుపుకు మొదలు చిగురించింది... నీ చూపుతో...

నీ పెదవి పిలుపుకు మనసు మరొక్కసారి జన్మించిది.... నీ మధురిమతో...

Monday, January 19, 2009

నీకు న్యాయమా?


ఎందుకో తెలియదు... సాగర కెరటాల ఆరాటాలు నా మనసులో ఎప్పుడూ ఎగిసి పడుతూనే ఉంటాయి...

ఎన్నో ఆశలు...ఎన్నో ఊహలు...ఎన్నో కలల సౌధాలు...ఒక్కసారిగా కన్నీటి ధారలలో చేరిపోయాయి...

ఒక శిల శిల్పంగా మారాలి అంటే ... శిల్పికి ఎంత ఓర్పు అవసరమో...ఆ శిలకి కూడ అంతే సహనం అవసరం..

।ఏ ఒక్కరు విసుగు చెందినా... శిల లో ఉన్న శిల్పం కలగానే ఉండి పోతుంది...

కనురెప్పను తెరవడానికి ఒక వెలుగు అడ్డు వస్తోంది అంటే... ఆ తప్పు కిరణానిది కాదు...

చూసేందుకు శక్తి లేని ఆ నయనానిది...

అదే కన్నులతో నా మనసుని చూడలేని నువ్వు... తప్పు నా పైన వెయ్యటం నీకు న్యాయమా?

నీకు తెలుసా?

నీ చిరునవ్వుని అడగాలని ఉంది... కష్టం అంటే తెలుసా అని...

ఆ చిరుదివ్వెను అడగాలని ఉంది... చీకటి అంటే తెలుసా అని...

నీ సిరిమువ్వని అడగాలని ఉంది... మౌనం అంటే తెలుసా అని...

ఆ చిరుగాలిని అడగాలని ఉంది... స్థంబించటం అంటే తెలుసా అని...

నీ చిరు మనసుకి చెప్పాలని ఉంది... నా శ్వాసకి ప్రాణం నువ్వే అని...