Thursday, September 25, 2008

అయితే

శబ్ధం కాస్త నిశ్శబ్ధం అయితే...

ధైర్యం కాస్త అధైర్య పడితే...

మౌనం కాస్త గానం చేస్తే...

నిద్దుర వచ్చి కనురెప్పను తెరిస్తే...

దీనికి కారణం నీ ప్రేమే అయితే...

ఆ ప్రేమనే నువ్వు వరముగా ఇస్తే...

Wednesday, September 24, 2008

My Life Shades

Once upon a time, I was crawling to reach my mother..
Now... Even If I run, I can't reach her..

Once upon a time, I was learning to make my dreams come true..

Now I am dreaming on how to learn new things..

Once upon a time, I spent my time with hearty friends around me..

Now I am spending my time with heartless machines..

Once upon a time, I never liked lessons from any one..

Now I am forced to listen lessons from every one..

Once upon a time I was praying to God for my future ...

Now I pray to my computer because it has become a God to me..

Life is ours don’t give any chance for it to be decided by others; we have to decide our Life... 

Remember the golden moments in the past and every moment will give birth to a small smile on your lips... 

Tuesday, September 23, 2008

కన్నీటికి మాటలొస్తే?

మాట మూగ పోవచ్చు కాని మనసు మాత్రం ఎప్పుడూ మువ్వలా మ్రోగుతూనే ఉంటుంది...
క్షణానికి ఎన్ని యుగాలో తెలియదు, కాని ఒక మనసుకి ఎన్ని మమకారాలో ఇప్పుడే తెలిసింది నీ ప్రేమలో॥చేసే ప్రతీ పనిలో...చూసే ప్రతీ వస్తువులో... పలికే ప్రతీ మాటలో...
నిద్రించే ఈ కనులలో... ఇలా ఎన్నో జ్ఞాపకాలు...
వీటిని దాచటానికి ఒక బ్యాంకు ఉంటే బాగుంటుంది కదా? హ్యాపీగా నిద్ర పోవచ్చు... :-)
ప్రేమ మనిషిని పిచ్చి వాడిని చేస్తుంది అని అంతా అంటారు... కాని అది శుద్ధ అబద్ధం... 
ఒక అమ్మాయి ఆ మనిషిని పిచ్చి వాడిని చేస్తుంది... ఇది పచ్చి నిజం...
ప్రశ్నించేది మీరే... జవాబు ఇచ్చేది మీరే...కొట్టేది మీరే... ఏడ్చేది మీరే...
చివరకు మా మనసులు నరికి... నీకు మనసు లేదు అని జారిపోయేది మీరే...
మేఘానికి మనసు లేకున్నా కరుగుతుంది... మగువకు మనసున్నా కరుగదు...
ప్రతీ క్షణం కనురెప్ప దాటడానికి మొహమాట పడుతున్న కన్నీటికి ధైర్యం చెప్పి మరీ నీ జ్ఞాపకాలను విడుస్తున్న నీ మనసు లేని ప్రేమికుడు...(ఎందుకంటే ఆ మనసు ఎప్పుడో చేజారిపోయింది...)
కన్నీటి తీగలతో బాధ అనే సంగీతాన్ని విలపిస్తూ ఆలపిస్తున్న గీతం ఇది....

Thursday, September 11, 2008

నేను ప్రేమిస్తే?

ఈ విశ్వంలో నాకు తెలిసినంత వరకు అత్యంత విలువైనది ప్రేమ మాత్రమే...
అలాంటి ప్రేమని తాకాలని ప్రతీ మనసు తపిస్తూనే ఉంటుంది...
ఎందుకంటే అది స్వచ్ఛమైన గాలిలో స్వేచ్ఛగా తిరిగే హంసలాంటిది...
విధి అనే బాణం తగిలే వరకు అది ఎంతో ఆనందంగా తిరుగుతూనే ఉంటుంది...
ప్రేమించినప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఉంటే...
అది విఫలమైనప్పుడు మనసు అనే సామ్రాజ్యాన్ని కోల్పోయినంత దుఃఖంతో ఉంటుంది...
క్షణాన్ని విషంలా భావించే వాడు ఒకడు...
నరకాన్ని అమితంగా ప్రేమించేవాడు ఇంకొకడు...
పంచ భూతాలలో తనూ ఒక భూతం అయితే బాగున్ను అనేవాడు మరొకడు...
పిడికిలి లో గాలి ఉండదు... వెలుతురు ఉండదు... కాని గెలవాలి అనే లక్ష్యం మాత్రం ఉంటుంది... కాని పిడికిలంత మనసులో ప్రేమ అనే చిన్నఅలికిడి ఉంటే చాలు... ఆ ప్రేమ గెలిచే వరకూ తనకు చేరువయ్యే మనసుతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది...
ప్రేమించే వాడు పిరికివాడు కాడు॥అలాగే పిరికివాడు ఒక గొప్ప ప్రేమికుడు కాలేడు॥