Thursday, September 11, 2008

నేను ప్రేమిస్తే?

ఈ విశ్వంలో నాకు తెలిసినంత వరకు అత్యంత విలువైనది ప్రేమ మాత్రమే...
అలాంటి ప్రేమని తాకాలని ప్రతీ మనసు తపిస్తూనే ఉంటుంది...
ఎందుకంటే అది స్వచ్ఛమైన గాలిలో స్వేచ్ఛగా తిరిగే హంసలాంటిది...
విధి అనే బాణం తగిలే వరకు అది ఎంతో ఆనందంగా తిరుగుతూనే ఉంటుంది...
ప్రేమించినప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఉంటే...
అది విఫలమైనప్పుడు మనసు అనే సామ్రాజ్యాన్ని కోల్పోయినంత దుఃఖంతో ఉంటుంది...
క్షణాన్ని విషంలా భావించే వాడు ఒకడు...
నరకాన్ని అమితంగా ప్రేమించేవాడు ఇంకొకడు...
పంచ భూతాలలో తనూ ఒక భూతం అయితే బాగున్ను అనేవాడు మరొకడు...
పిడికిలి లో గాలి ఉండదు... వెలుతురు ఉండదు... కాని గెలవాలి అనే లక్ష్యం మాత్రం ఉంటుంది... కాని పిడికిలంత మనసులో ప్రేమ అనే చిన్నఅలికిడి ఉంటే చాలు... ఆ ప్రేమ గెలిచే వరకూ తనకు చేరువయ్యే మనసుతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది...
ప్రేమించే వాడు పిరికివాడు కాడు॥అలాగే పిరికివాడు ఒక గొప్ప ప్రేమికుడు కాలేడు॥

3 comments:

Narayana said...

Excellent. nee kavitha hrudayaaniki joharlu mitrama...
prema gurichi inta goppaga cheppatam kodarike sadhyam...

excellent.... boy

Unknown said...

What a sensitive heart you have!! Also, at this young age, you expressed the feelings so well!! Do you publish any of your works? keep up the good work.

Anonymous said...

Awesome rey