Wednesday, September 1, 2010

నీ మనసు గెలవడానికై...

విశ్వాన్ని జయించాలని ప్రయత్నించి చివరకి తన మనసుతో యుద్ధంచేసి ఓడిపోయిన అలేగ్జాండర్...

పార్వతిని ప్రేమించిన వియోగంలో మధువుని అమితంగా ప్రేమించి బానిస అయిన దేవదాస్...

చిన్న కోరిక కోసం ఘోర తపస్సు చేసి ఏది కోరుకోవాలో తెలియక తికమక పడిన ధ్రువుడు..

ఇలా ఒకప్పుడు ఇంతగా ఆలోచించిన నేను.. ఇప్పుడు కేవలం నీకోసమే ఆలోచిస్తున్నాను అంటే... ఇంకా అర్ధం కాలేదా?

టైమ్ ని కనిపెట్టడానికి ఎంత టైమ్ పట్టిందో తెలీదుగాని... నీమీద ప్రేమ పుట్టడానికి మాత్రం నాకు ఒక యుగం పట్టింది... ఎందుకంటే... నిన్ను చూసిన క్షణం... ప్రతీక్షణాన్ని ఒక యుగంలా భావిస్తున్నా కనుక....

Tuesday, January 12, 2010

నా చెలి అలిగితే...

అప్పుడప్పుడు చూసే అణు యుద్ధాల కన్నా... నా చెలి చేసే కను యుద్ధాలంటే నాకు చాలా భయం...

అలిగిన కన్నులు కాస్త బిడియంతో వర్షించలేక... తన చెక్కిలి ఎరుపుని అప్పుగా తీసుకున్న ఆ కళ్లని చూడాలంటే నాకు చాలా భయం....

మయూఖ మేలిమితో మకుటం లేని మహారాణుల్లా కనిపించే వ్రేళ్లతో నన్ను నిందించటానికి ప్రయత్నిస్తూ ఉండే వ్రేళ్లని చూడాలంటే నాకు చాలా భయం...

పాదరసంలాంటి పాదాలతో కోపంగా నేలను తడుతూ నన్ను కొడుతు,నెడుతూ ఉండే పాదాలని చూడాలంటే నాకు చాలా భయం...

ఇలాంటి అతిశయమైన కష్టాలు ఊహల్లో చాలా అందంగా ఉంటాయి...
కాని ఊహకి బయట చూడాలి అంటే నిజంగా నాకు చాలా భయం....